ఓటిటి డేట్ ఫిక్స్ చేసుకున్న సల్మాన్ ‘సికందర్’

ఓటిటి డేట్ ఫిక్స్ చేసుకున్న సల్మాన్ ‘సికందర్’

Published on May 24, 2025 12:08 PM IST

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ తెరకెక్కించిన రీసెంట్ చిత్రమే “సికందర్”. ఈ చిత్రంతో అయినా సల్మాన్ కం బ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటే ఈ చిత్రం కూడా డిజాస్టర్ గానే మిగిలిపోయింది. మరి ఈ చిత్రం థియేటర్స్ లో ఈ ఏడాది ఈద్ కానుకగా రిలీజ్ కి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఫైనల్ గా ఓటిటి రిలీజ్ కి సిద్ధం అయ్యింది.

ఈ చిత్రం ఫైనల్ గా ఓటిటి డేట్ ని అయ్యితే ఇపుడు ఫిక్స్ చేసుకుంది. ఈ చిత్రం తాలూకా ఓటిటి హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా రిలీజ్ ని ఈ మే 25 ఆదివారం అంటే రేపే స్ట్రీమింగ్ కి తీసుకొస్తున్నట్టు ఖరారు చేశారు. సో ఈ చిత్రం కోసం చూస్తున్నవారికి గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా సల్మాన్ స్నేహితుడు సాజిద్ నడియాద్వాల నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు