ఓటీటీ : రెట్రో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ !

ఓటీటీ : రెట్రో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ !

Published on May 26, 2025 10:57 AM IST

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన సినిమా “రెట్రో”. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ ను రాబట్టలేకపోయింది. కాగా తాజాగా రెట్రో సినిమా డిజిటల్ ప్రీమియర్‌కు రెడీ అయింది. మే 31న, 2025 నుంచి తమిళం, తెలుగు మరియు అనేక ఇతర ప్రధాన భారతీయ భాషలలో ఈ చిత్రం తమ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ప్రసారం కాబోతుందని నెట్‌ఫ్లిక్స్ తాజాగా అధికారికంగా ప్రకటించింది.

ఐతే, థియేటర్ విడుదలకు ఓటీటీ అరంగేట్రానికి మధ్య అంతరం ఒక నెల కూడా లేకపోవడం విశేషం. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఈ చిత్రం విజయాన్ని అందుకోలేకపోయింది. ఆ కారణంగానే త్వరగా స్ట్రీమింగ్ కాబోతుంది. మరి, ఓటీటీలో ఈ సినిమా ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఈ చిత్రంలో జోజు జార్జ్, నాజర్ మరియు జయరామ్‌ వంటి తారాగణం కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా సూర్య, జ్యోతికలు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు