‘ఒరేయ్‌ బుజ్జిగా’.. హండ్రెడ్ ప‌ర్సెంట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ !

‘ఒరేయ్‌ బుజ్జిగా’.. హండ్రెడ్ ప‌ర్సెంట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ !

Published on Mar 13, 2020 2:18 AM IST

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్న యూత్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఒరేయ్‌ బుజ్జిగా…. ఉగాది కానుకగా మార్చి 25న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల‌వుతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో…యంగ్ హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ – “ఒరేయ్ బుజ్జిగా ఒక కంప్లీట్ ఎంటర్ టైనర్. టీమ్ అందరూ ఎంతో ఫ్యాషన్ తో సినిమాని ముందుకు తీసుకెళ్లారు. థియేటర్ లో సినిమా చూసి రెండున్నర గంటలు నవ్వుతూనే ఉంటారు. మార్చి 25న సినిమా విడుదలవుతుంది. ఎగ్జామ్స్ అయిపోయి హాలిడేస్ వస్తాయి. ఫ్యామిలీ అంతా వచ్చి హ్యాపీ గా నవ్వుకుని వెళ్లే సినిమా. ప్రతి ఒక్కరూ థియేటర్ లోనే సినిమా చూడండి. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత రాధా మోహన్ గారికి, దర్శకుడు విజయ్ కుమార్ గారికి ధ‌న్యవాదాలు” అన్నారు.

దర్శకుడు కొండా విజయ్ కుమార్ మాట్లాడుతూ – “మా నిర్మాత రాధా మోహన్ గారితో చాలా కాలంగా మంచి అనుబంధం ఉంది. చాలా మంచి నిర్మాత. కథకు ఏమి కావాలో అన్ని ఇచ్చి నాకు సపోర్ట్ చేశారు. సినిమాలో హ్యుజ్ ప్యాడింగ్‌ ఉంది. అందరు చక్కగా నటించారు. ముఖ్యంగా రాజ్ తరుణ్ మన పక్కింటి కుర్రాడిలా ఉంటాడు. హండ్రెడ్ పర్సెంట్ ఆయనకి తగిన సినిమా. మాళవిక నాయర్ న్యాచురల్ ఆర్టిస్ట్. ప్రతి ఒక్కరు ఇది నా సినిమా అని ఓన్ చేసుకొని అద్భుతంగా పెర్ఫామ్ చేశారు. సినిమాలో అన్ని క్యారెక్టర్స్ కి జస్టిఫికేషన్ ఉంటుంది. అలాగే ఆండ్రూగారు, అనూప్ ఇలా అందరు మంచి మంచి టెక్నీషియ‌న్స్‌ కుదిరారు. ఏ జోనర్ లో సినిమా చేయాలని మూడు సంవత్సరాలుగా నాలో నేను మధన పడి, ఆడియన్స్ అందరూ పడి పడి నవ్వుకునే సినిమా చేయాలని ఒరేయ్ బుజ్జిగా చేయడం జరిగింది. ఉగాది పచ్చడిలో ఎలాగైతే షడ్రుచులు ఉంటాయో ఈ సినిమాలో కూడా అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ ఉగాదికి మీ ముందుకు వస్తున్నాం. మీ అందరి ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నాను’ అన్నారు. చిత్ర నిర్మాత కె.కె. రాధా మోహన్ మాట్లాడుతూ – “ఒరేయ్ బుజ్జిగా నేను, విజయ్ కుమార్ స్టార్ బక్స్ లో కాఫీ తాగుతున్నప్పుడు ఈ స్టోరీ నేరేట్ చేశారు. అక్కడ స్టార్ట్ అయిన సినిమా ఈ ఉగాదికి పచ్చడిలా వస్తుంది. మా ఒరేయ్ బుజ్జిగా టైటిల్ బాగా పాపులర్ అయింది. ఇప్పటికే విడుదలైన కురిసెన, కురిసెన పాటకి మంచి రెస్పాన్స్ వచ్చింది. యూత్ కి, ఫ్యామిలీస్ కి నచ్చే అన్ని రకాల కమ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా. ఇప్పటివరకు సినిమా చూసిన వారుకూడా చాలా ఎంటర్టైనింగ్ గాఉంది అని చెప్పారు. మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ నాకు మంచి మిత్రుడు. ఈ సినిమాకి బ్రహ్మాండమైన ట్యూన్స్ ఇచ్చారు. వాణి విశ్వనాధ్ గారు హీరోయిన్ తల్లిగా ఒక ముఖ్యమైన పాత్ర చేశారు. ఆమెకు కూడా తెలుగులో మంచి రీఎంట్రీ అవుతుంది. పోసాని, నరేష్, సత్య ఇలా చాలా మంది సీనియర్ ఆర్టిస్టులు ఈ సినిమాలో నటించారు. అందరూ చూసి ఆదరించాల్సిందిగా కోరుకుంటున్నాను’ అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు