‘లెజెండ్’ కి కట్స్ ఏం లేవు, ఓన్లీ బీప్స్ మాత్రమే.!

legend

‘నందమూరి బాలకృష్ణ నటించిన లెజెండ్ మూవీలో ఒక్క డైలాగ్ కట్ కూడా లేదు’ అని ఈ చిత్ర నిర్మాతలో ఒకరైన అనిల్ సుంకర ట్వీట్ చేసారు. ప్రస్తుతం మీడియాలో సెన్సార్ బోర్డు వారు ఈ చిత్ర టీంకి కొన్ని డైలాగ్స్ ని కట్ చేసారనే వార్తలకి అనిల్ సుంకర తెరదించాడు.

ఇక విషయంలోకి వస్తే ఓవరాల్ గా రెండు బీప్స్ మాత్రమే విధించిన సెన్సార్ కట్స్ ఏమీ విధించలేదు. ఇదే విషయాన్ని అనిల్ సుంకర కూడా ఖరారు చేసారు. అలాగే ఆయన మాట్లాడుతూ ‘ఆ బీప్స్ కూడా డైలాగ్స్ ని చెడగొట్టేలా ఉండవని’ అన్నాడు.

లెజెండ్ సినిమా రేపు భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు రానుంది. బోయపాటి శ్రీను డైరెక్ట్ చెఇస్న ఈ మూవీని వారాహి చలన చిత్రం తో కలిసి 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మించారు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Exit mobile version