‘ఒంగోలుగిత్త’ లో ఇక మిగిలింది ఆ రెండే.!

‘ఒంగోలుగిత్త’ లో ఇక మిగిలింది ఆ రెండే.!

Published on Nov 16, 2012 4:23 PM IST


ఎనర్జిటిక్ హీరో రామ్ మరియు ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాల డైరెక్టర్ ‘బొమ్మరిల్లు’ భాస్కర్ కాంబినేషన్లో రానున్న సినిమా ‘ఒంగోలుగిత్త’. రెగ్యలర్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తయ్యింది. ఈ చిత్ర టీం మారథాన్ షెడ్యూల్ మరియు తణుకు చుట్ట ప్రక్కల ఏరియాల్లో షూటింగ్ పూర్తి చేసుకొని హైదరాబాద్ తిరిగివచ్చారు. ఈ సినిమాలో ఇంకా రెండు పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. నవంబర్ చివరి లోపు ఈ చిత్ర ఆడియో ని విడుదల చేసి డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి జి.వి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. కృతి కర్బంద హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటి వరకూ సాఫ్ట్ టైటిల్స్ మరియు సున్నితమైన అంశాలను తీసుకొని సినిమాలు తీసిన భాస్కర్, తొలిసారి మాస్ టైటిల్ తో మనముందుకు రానున్నాడు. ఈ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి మరి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు