పరిశ్రమలో తాజా సమాచారం ప్రకారం ఎనర్జిటిక్ హీరో రామ్ రాబోతున్న చిత్రం “ఒంగోలు గిత్త” ఫిబ్రవరి 1న విడుదల కానున్నట్లు తెలుస్తుంది. బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన ఈ మాస్ ఎంటర్ టైనర్ నిజానికి జనవరిలోనే విడుదల కావలసింది. బి వి ఎస్ ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి జి వి ప్రకాష్ సంగీతం అందించగా మణిశర్మ రీ-రికార్డింగ్ అందించడమే కాకుండా ఒక పాటను కూడా ట్యూన్ చేశారు.
కృతి కర్బంధ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో రామ్ ఫుల్ మాస్ క్యారెక్టర్లో కనిపించనున్నారు. “బొమ్మరిల్లు” చిత్రం తరువాత భాస్కర్ సరయిన విజయాన్ని నమోదు చెయ్యలేదు. ఈ చిత్రంతో విజయం సాదిస్తాడని ఆసక్తిగా వేచి చూస్తున్నారు.