ఈ వారం కూడా పెద్ద సినిమాలు లేవు

ఈ వారం కూడా పెద్ద సినిమాలు లేవు

Published on Nov 16, 2012 8:30 AM IST


శుక్రవారం వచ్చిందంటే చాలు సినీ అభిమానుల్లో పండగ వాతావరణం ఉంటుంది. ఎందుకంటే ప్రతి శుక్రవారం ఎదో ఒక సినిమా రిలీజ్ అవుతూనే ఉంటాయి. పెద్ద సినిమాలు ఎదో ఒక చిన్న సినిమా రిలీజ్ అవుతుంటాయి. కానీ గత 3, 4 వారాలుగా తెలుగు సినిమాలు లేక వెలవెలబోతుంది. సాధారణంగా నవంబర్ నెల తెలుగు సినిమాలకు బాడ్ సీజన్ కావడంతో ఈ నెల రిలీజ్రిలీజ్ చేయడానికి తెలుగు సినిమా నిర్మాతలెవరూ ధైర్యం చేయడం లేదు. కెమెరామెన్ గంగతో రాంబాబు, దేనికైనా రెడీ సినిమాల తరువాత చెప్పుకోతగ్గ తెలుగు సినిమా రాలేదు. దీపావళి రోజున తుపాకి ఒకటే విడుదల కాగా అది డబ్బింగ్ సినిమా. శ్రీకాంత్ దేవరాయ ఈ రోజే విడుదల కావాల్సి ఉండగా ఎందుకో విడుదల మాత్రం కాలేదు. నెక్స్ట్ వీక్ రొటీన్ లవ్ స్టొరీ విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కృష్ణం వందే జగద్గురుం, ఒక్కడినే, జీనియస్ నవంబర్ నెలాఖరు నుండి విడుదలకి ప్లాన్ చేసుకుంటున్నాయి. తెలుగు సినిమాలు ఏమి లేకపోవడం, మౌత్ టాక్ బావుండటంతో ప్రేక్షకులు తుపాకి సినిమా చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు