మరో సారి చంపేశారు.. వార్నర్‌కి థ్యాంక్స్ చెప్పిన బన్నీ..!

మరో సారి చంపేశారు.. వార్నర్‌కి థ్యాంక్స్ చెప్పిన బన్నీ..!

Published on May 12, 2020 11:04 PM IST

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఓపెనర్ డేవిడ్ వార్నర్ గత కొద్ది రోజులుగా టిక్‌టాక్‌లో వరుస వీడియోలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. అయితే అల వైకుంఠపురంలో సినిమా నుండి కొద్దిరోజుల క్రితం బుట్ట బొమ్మ పాటకు తన భార్యతో కలిసి డ్యాన్స్ చేసిన టిక్‌టాక్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.

అయితే తాజాగా అదే సినిమాలోని మంచి మాస్ బీట్ సాంగ్ రాములో రాములో సాంగ్‌కి మరో సారి వార్నర్ దంపతులు స్టెప్పులేశారు. అయితే వార్నర్ వీడియో పైన హీరో అల్లు అర్జున్ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. మరో బిగ్ సప్రైజ్ అంటూ ధన్యవాదాలు తెలుపుతూ, డ్యాన్స్ చంపేశారు సార్ అని ట్వీట్ చేశాడు. అయితే వార్నర్ చేసిన ఈ వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు