తేజస్ గుంజల్ ఫిలిమ్స్ మరియు రోహిత్ గుంజల్ ఫిలిమ్స్ పతాకంపై వెంకటేష్ పెద్దపాలెం, అపర్ణ మల్లిక్ మరియు హీనా సోని హీరో, హీరోయిన్స్ గా మరియు టెంపర్ వంశి, ఆర్ ఎక్స్ 100 కరణ్ విలన్స్ నటిస్తున్న యాక్షన్ క్రైమ్ డ్రామా చిత్రం వన్ బై ఫోర్ (one/4). బాహుబలి పళని కె ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రంజన రాజేష్ గుంజల్ మరియు రోహిత్ రాందాస్ గుంజల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రం షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీ తో సిద్ధంగా ఉంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబర్ లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర యూనిట్.
ఈ సందర్భంగా దర్శకుడు నిర్మాతలు మాట్లాడుతూ..”వన్ బై ఫోర్ (one/4) ఒక యాక్షన్ క్రైమ్ డ్రామా చిత్రం. షూటింగ్ మొత్తం వైజాగ్ లో జరిగింది. నోరు జారితే జరిగే పరిణామాలు వాటివల్ల వచ్చే సమస్యలు ఎలాఉంటాయో చెప్పే కథే మా వన్ బై ఫోర్ (one/4) చిత్రం కథ.
సినిమా చాలా కొత్తగా ఫ్రెష్ గా ఉంటుంది. మంచి థ్రిల్లింగ్ కథ తో అద్భుతమైన క్రైమ్ యాక్షన్ సన్నివేశాలతో రూపొందించాం. టీజర్ మరియు పాటలు టి సిరీస్ యూట్యూబ్ లో విడుదల చేసాము. మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా క్రేజీ గా కొత్త గా ఉంటుంది, సెప్టెంబర్ విడుదల చేస్తాం” అని తెలిపారు.