ఎప్పటిదో కాజల్ సినిమా డైరెక్ట్ ఓటిటిలో.!?

ఎప్పటిదో కాజల్ సినిమా డైరెక్ట్ ఓటిటిలో.!?

Published on Jul 23, 2020 6:09 PM IST


మన దగ్గర కేవలం హీరోలకు మాత్రమే కాకుండా హీరోయిన్స్ పై కూడా కొన్ని సార్లు స్పెషల్ సినిమాలు వస్తుంటాయి. అలా ఇది వరకే చాలా సినిమాలు వచ్చాయి. అయితే కుర్రకారును ఎంతగానో ఆకట్టుకున్న కాజల్ అగర్వాల్ మెయిన్ లీడ్ లో నటించిన ఓ చిత్రం డైరెక్ట్ గా స్ట్రీమింగ్ లోకి రానున్నట్టు తెలుస్తుంది. అది కూడా ఆమె ఎప్పుడో నటించిన సినిమా అని సమాచారం.

కాజల్ అగర్వాల్ మెయిన్ లీడ్ లో రమేష్ అరవింద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “ప్యారిస్ ప్యారిస్”. నిజానికి ఈ చిత్రం 2018 లోనే విడుదల కావాల్సి ఉన్నా పలు కారణాల చేత ఆగిపోవాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు ఈ చిత్రం నేరుగా స్ట్రీమింగ్ లో విడుదల కానున్నట్టు తెలుస్తుంది. హిందీలో కంగనా రనౌత్ నటించిన “క్వీన్” కు రీమేక్ గా తమిళంలో తెరకెక్కించారు. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఏ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లో రానుందో చూడాలి.

తాజా వార్తలు