ప్రభాస్ మూవీ ఫస్ట్ లుక్ వచ్చేస్తుంది..!

ప్రభాస్ తన లేటెస్ట్ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. దర్శకుడు రాధా కృష్ణ ఈ చిత్ర షూటింగ్ జార్జియా దేశంలో చిత్రీకరిస్తున్నారు. కొద్దిరోజులుగా జరుగుతున్న ఈ మూవీ షెడ్యూల్ పూర్తయినదట. అలాగే విపత్కర పరిస్థితులలో షూటింగ్ కి సంహరించిన జార్జియా టీమ్ కి కృతజ్ఞతలు అని డైరెక్టర్ సోషల్ మీడియా వేదికగా చెప్పారు. అలాగే త్వరలో మూవీ నుండి ఫస్ట్ లుక్ రానుందని ఆయన హింట్ కూడా ఇచ్చారు.

ఐతే మరో కొద్దిరోజులలో ఉగాది పండుగ నేపథ్యంలో ఈ మూవీలోని ప్రభాస్ లుక్ విడుదల చేసే అవకాశం కలదు. కాబట్టి ఉగాది రోజున ఈ మూవీ టైటిల్ మరియు ఫస్ట్ లుక్ విడుదల చేసే సూచనలు గట్టిగా కనిపిస్తున్నాయి. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ పీరియాడిక్ మూవీలో ప్రభాస్ కి జంటగా మొదటిసారి పూజ హెగ్డే నటిస్తుంది.

Exit mobile version