ముద్దు సన్నివేశాల్లో నటించడానికి ఇబ్బందిలేదు – వాణి కపూర్

ముద్దు సన్నివేశాల్లో నటించడానికి ఇబ్బందిలేదు – వాణి కపూర్

Published on Feb 15, 2014 1:00 PM IST

Vani-Kapoor-Latest-Stills-(

వాణి కపూర్ ఒక దైర్యవంతురాలిగా, అర్ధరహితమైన మహిళగా కనిపిస్తుంది. ఆమె హీరోయిన్ గా నటించిన ‘ఆహా కళ్యాణం’ సినిమా వచ్చే వారం విడుదలకు సిద్దమవుతుంది. వాణి కపూర్ నటించిన మొదటి సినిమా ‘శుద్ధ్ దేశి రొమాన్స్’. ఈ సినిమాలో వాణి కూపూర్ కొన్ని రొమాన్స్ సన్నివేశాలలో నటించడం జరిగింది. దానితో కొద్దిమంది ఆమెని ‘ఆహా కళ్యాణం’ సినిమాలో కూడా అలాంటి సన్నివేశాలు వుంటాయా అని ప్రశ్నించడం జరిగింది. దానికి వాణి సున్నితంగా సమాదానం చెప్పారు. సినిమాలో ముద్దు సన్నివేశాల్లో నటించడానికి తనకు ఎటువంటి ఇబ్బందిలేదని చెప్పింది. ” స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే సినిమాలో ముద్దు సన్నివేశంతో బాగుంటుంది అనిపిస్తే చేస్తే తప్పేంటి అని అంది. అలాగే ఆహా కల్యాణంలో ముద్దు సన్నివేశాలు ఉన్నాయా? లేవా?మీరే చూసి తెలుసుకొండి” అని అంది.

ఈ రొమాంటిక్ ఎంటర్టైనింగ్ సినిమాలో నాని, వాణి కపూర్ లు హీరో హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాని బాలీవుడ్లో బ్లాక్ బస్టర్ హిట్ సాదించిన ‘బ్యాండ్ బాజా బారత్’ సినిమా రీమేక్ గా నిర్మించారు. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించారు. దక్షిణ భారత దేశంలో ఈ నిర్మాణ సంస్థ మొదటి సారిగా నిర్మించిన సినిమా ఇది.

తాజా వార్తలు