నారా రోహిత్ మరియు నిత్య మీనన్ ప్రధాన పాత్రలలో రానున్న “ఒక్కడినే” చిత్రం విడుదల మరి కొంత ఆలస్యం కానుంది. ఈ చిత్రం డిసెంబర్ 7న విడుదల అవ్వాల్సి ఉండగా డిసెంబర్ 14కి వాయిదా వేశారు ఆరోజు కూడా విడుదల కాకపోవడం తర్వాత ఎటువంటి తేదీ ప్రకటించక పోవడంతో ఈ చిత్ర విడుదల తేదీ మీద గందరగోళం నెలకొంది. సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం ఆర్ధిక సమస్యలను ఎదుర్కొంటునట్టు తెలుస్తుంది. ఈ చిత్రం ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంది. శ్రీనివాస్ రాగ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సి వి రెడ్డి నిర్మించారు. కార్తీక్ సంగీతం అందించారు అన్ని సరిగ్గా జరిగితే ఈ చిత్రం జనవరి మొదట్లో విడుదల అవుతుంది.