ఒక్కడినే విడుదలకు సిద్ధం

ఒక్కడినే విడుదలకు సిద్ధం

Published on Nov 22, 2012 4:00 AM IST


బాణం, సోలో, చిత్రాల హీరో నారా రోహిత్ నెక్స్ట్ మూవీ ఒక్కడినే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్ర ప్రోగ్రెస్ రిపోర్ట్ తెలియజేయడానికి ఈ రోజు విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసారు. చిత్ర దర్శకుడు శ్రీనివాస్ రాగా మాట్లాడుతూ ‘తన కుటుంబం కోసం పోరాడే వాడె అసలైన హీరో. మా సినిమాలో హీరో తన కుటుంబం కోసం ఏం చేసాడనేది ఈ సినిమాలో చూడండి. కుటుంబ సభ్యుల మధ్య అనుబందాలు, ఆప్యాయతల మీద ఈ సినిమాని తీర్చిదిద్దాము. చిత్ర నిర్మాత సీవీ రెడ్డి గారి సహకారం మర్చిపోలేనిది”. నిర్మాత సీవీ రెడ్డి మాట్లాడుతూ అనుకున్న టైంకి షూటింగ్ పూర్తి చేయగలిగాము. పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తయ్యాయి. మ్యూజిక్ డైరెక్టర్ కార్తీక్ మొదటిసారి సంగీతం అందిస్తున్నప్పటికీ చాలా మంచి పాటలు ఇచ్చాడు. రోహిత్ గత సినిమాల కంటే ఈ సినిమాతో ఇంకా మంచి పేరు వస్తుంది. నేను నిర్మించిన అన్ని సినిమాల్లో ఇది కమర్షియల్ గా ఇది మంచి విజయాన్ని సాధిస్తుంది. డిసెంబర్ 7న ఒక్కడినే సినిమాని విడుదల చేయబోతున్నాం అన్నారు.

తాజా వార్తలు