డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ‘ఒక్కడినే’

డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ‘ఒక్కడినే’

Published on Sep 14, 2012 8:55 AM IST


‘సోలో’ సినిమాతో హిట్ కొట్టిన తర్వాత నారా రోహిత్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ఒక్కడినే’. నారా రోహిత్ సరసన కేరళ కుట్టి నిత్యా మీనన్ కథానాయికగా నటించింది. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్ర డబ్బింగ్ కార్యక్రమాలు శబ్దాలయా స్టూడియోలో జరుగుతున్నాయి. నిన్న నారా రోహిత్ తన పాత్రకి డబ్బింగ్ చెప్పగా, ఈ రోజు సినిమాలో నటించిన కొంతమంది నటీనటులకు సంబందించిన డబ్బింగ్ కార్యక్రమాలు జరగుతున్నాయి. ఈ చిత్ర దర్శకుడు శ్రీనివాస్ రాగా దగ్గరుండి డబ్బింగ్ కార్యక్రమాలు చూసుకుంటున్నారు. సి.వి రెడ్డి నిర్మిస్తున్న ఈ ఫ్యామిలీ మరియు యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాకి ప్రముఖ గాయకుడు కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. అక్టోబర్లో ఆడియో విడుదల చేసి నవంబర్ లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తాజా వార్తలు