పార్వతి–దేవదాసుల ప్రేమకథలకి తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక క్రేజ్ ఉంది. అదే నేపథ్యాన్ని సమకాలీన శైలిలో ఆవిష్కరిస్తూ, “ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు” అనే టైటిల్‌తో ఒక కొత్త చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మాహిష్మతి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తోట రామకృష్ణ దర్శక–నిర్మాతగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.
ఇటీవల చిత్రీకరణ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. విడుదల చేసిన ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. కాలేజ్ నేపథ్యంలో సాగిపోయే ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీను ప్రత్యేకమైన హాస్యం, భావోద్వేగాలతో యువతను ఆకట్టుకునేలా మలిచామని దర్శక–నిర్మాత తోట రామకృష్ణ తెలిపారు.
సిద్దార్థ్ మీనన్, దిలీప్ హీరోలుగా, రాశి సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో రఘు బాబు, కశి రెడ్డి రాజ్ కుమార్, వీర శంకర్, గౌతం రాజు, రాకెట్ రాఘవ, గుండు సుదర్శన్, రవితేజ, రజిత తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తారు.
సంగీత విభాగంలో మోహిత్ రహమానియాక్ ఆకట్టుకునే స్వరాలు అందించగా, ఆస్కార్ విజేత లిరిసిస్ట్ చంద్రబోస్‌తో పాటు సుద్దాల అశోక్ తేజ, భాస్కరభట్ల అందించిన సాహిత్యం ఈ చిత్రానికి మరింత బలం చేకూర్చనుంది. విడుదల తేదీ, ట్రైలర్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.