రెండో షెడ్యూల్ లో ఒక లైలా కోసం

Naga-Chaitanya-new
నాగచైతన్య, విజయ్ కుమార్ కొండా కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు ‘ఒక లైలాకోసం’ పేరును పరిశీలిస్తున్నారు. ఈ సినిమాకు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. పూజా హెగ్దే ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయంకానుంది

ఈ సినిమా డిసెంబర్ మధ్యలో మొదటి షెడ్యూల్ ను ప్రారంభించి ఇటీవలే ముగించుకుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ఇప్పుడు మొదలైంది. ఆలీ పై కొన్ని షాట్లను తెరకెక్కిస్తున్నారు. ఈ దర్శకుడు ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాను తీసి టాలీవుడ్ కు విజయాన్ని అందించారు. అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు. ఈ సినిమా ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది

Exit mobile version