‘ఓజి’ మేకర్స్ నుంచి భారీ మొత్తం తీసుకున్న ప్రశాంత్ వర్మ? అసలు నిజం బయటకి

టాలీవుడ్ దగ్గర ఆర్ ఆర్ ఆర్ లేటెస్ట్ గా ఓజి లాంటి పలు సెన్సేషనల్ సినిమాలు అందించిన భారీ నిర్మాణ సంస్థ డివివి ఎంటర్టైన్మెంట్స్ అలాగే యువ పాన్ ఇండియా దర్శకుడు ప్రశాంత్ వర్మలపై ఓ షాకింగ్ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ప్రశాంత్ వర్మ ఈ సంస్థ నుంచి భారీ మొత్తం అడ్వాన్స్ లుగా తీసుకున్నాడని పలు రూమర్స్ బయటకి రాగా వీటిపై నేరుగా డివివి సంస్థ అధికారిక ప్రెస్ నోట్ తో క్లారిటీ ఇచ్చింది.

అవన్నీ నిరాధారం అని ప్రశాంత్ వర్మతో ఎలాంటి ఆర్ధిక లావాదేవీలు కానీ ఏదైనా సినిమా ఓకే చేసుకోవడం లాంటివి ఇంతవరకు జరగలేదు అని అధికారికంగా వెల్లడించారు. అలాగే ఇలాంటి గాలి వార్తలను ఎవరూ ప్రచారం చేయవద్దు అని కూడా రిక్వెస్ట్ చేశారు. సో ఆ షాకింగ్ రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని చెప్పాలి.

Exit mobile version