‘ఓజి’: పవన్ బర్త్ డే గిఫ్ట్ తెచ్చిన ఇమ్రాన్ హష్మీ.. మ్యాడ్ లెవెల్లో ఈ గ్లింప్స్

OG

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “ఓజి”. దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ భారీ యాక్షన్ కం గ్యాంగ్ స్టర్ చిత్రం పట్ల ఉన్న హైప్ తారా స్థాయిలో ఉంది. మరి ఈ హైప్ లోనే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కూడా నేడు రాగా మేకర్స్ ఆల్రెడీ సాలిడ్ పోస్టర్ ని నేడు వదిలారు.

డెఫినెట్ గా ఈ గ్లింప్స్ ని చాలా మంది పవన్ కళ్యాణ్ సైడ్ నుంచి ఉంటుంది అనుకున్నారు కానీ మేకర్స్ కొంచెం డిఫరెంట్ గా ట్విస్ట్ ఇచ్చి విలన్ ఇమ్రాన్ హష్మీ సైడ్ నుంచి ప్లాన్ చేయడం అనేది ఒక కూల్ అంశం అని చెప్పవచ్చు. అలాగే ఈ వీడియోలో ఇమ్రాన్ హష్మీ స్క్రీన్ ప్రెజెన్స్ గాని సుజీత్ తన పాత్రని ప్రెజెంట్ చేసిన విధానం గానే పర్ఫెక్ట్ విలన్ మెటీరియల్ గా కనిపిస్తున్నాయి.

ఇక దీనితో పాటుగా తాను ‘ఓజి’ కి బర్త్ డే విషెస్ చెప్పడం ఒకెత్తు అయితే లాస్ట్ లో కటానాతో పవన్ కళ్యాణ్ మ్యాడ్ లెవెల్ ట్రీట్ ఇచ్చారని చెప్పవచ్చు. ఇక ఈ మొత్తం గ్లింప్స్ లో మరో హీరో మాత్రం థమన్ అని చెప్పడంలో డౌట్ లేదు. ఖచ్చితంగా ఇది థమన్ నుంచి ఇప్పుడు వరకు వచ్చిన స్కోర్స్ లో ఫ్రెష్ అండ్ డిఫరెంట్ అని చెప్పవచ్చు. ఇదే టోన్ లో కానీ సినిమా కూడా ఉంటే మాత్రం బాక్సాఫీస్ బద్దలవ్వడం గ్యారెంటీ.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Exit mobile version