ఏపీలో ప్రీమియర్స్ ఫిక్స్.. ఊచకోతకు ఓజీ సిద్ధం..!

og

అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ చిత్రం సెప్టెంబర్ 25న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయింది. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ ఊచకోత చేయడం ఖాయమని అభిమానులు ఫిక్స్ అవుతున్నారు. ఇక తాజాగా రిలీజ్ అయిన ఈ చిత్ర ట్రైలర్‌కు ట్రెమెండస్ రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.

అయితే, ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు వేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఇప్పటికే తెలంగాణ సర్కార్ సెప్టెంబర్ 24న ప్రీమియర్స్ వేసుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. దీంతో ఓజీ కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా ఓజీ ప్రీమియర్స్‌కు అనుమతినిస్తూ జీవో జారీ చేసింది.

సెప్టెంబర్ 24న రాత్రి 10 గంటలకు ఈ స్పెషల్ ప్రీమియర్ షో వేసుకునేందుకు ఓజీ చిత్ర మేకర్స్‌కు ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీంతో రిలీజ్ రోజు కంటే ముందు రోజే ఈ చిత్రాన్ని వీక్షించేందుకు అభిమానులు సిద్ధమవుతున్నారు. మరి ఓజీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఊచకోత చేస్తాడా అనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.

Exit mobile version