యూఎస్ మార్కెట్ లో ‘ఓజి’ రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్స్!

యూఎస్ మార్కెట్ లో ‘ఓజి’ రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్స్!

Published on Sep 25, 2025 11:00 AM IST

OG

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఏంటో మళ్ళీ చూపిస్తున్న లేటెస్ట్ చిత్రమే “ఓజి”. భారీ హైప్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం రికార్డు ఓపెనింగ్స్ ని ఆల్రెడీ సొంతం చేసుకోగా యూఎస్ మార్కెట్ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్యాకెడ్ ప్రీమియర్స్ తో దుమ్ము లేపింది. మరి ఇలా ఓజి సినిమా ప్రీమియర్స్ తోనే సంచలనం సెట్ చేయగా ఇదే మూమెంటంలో యూఎస్ మార్కెట్ లో కూడా ఒక రికార్డు బ్రేకింగ్ ఓపెనింగ్స్ ని ఈ చిత్రం సొంతం చేసుకుంది.

మరి అక్కడ అనుకున్నట్టుగానే 3 మిలియన్ డాలర్స్ గ్రాస్ ని కేవలం ప్రీమియర్స్ తోనే కొల్లగొట్టి మన టాలీవుడ్ నుంచి ఒక రికార్డు బ్రేకింగ్ ప్రీమియర్ గా నిలిచింది. ఇక డే 1, లాంగ్ రన్ లు ఎలా ఉంటాయో చూడాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

తాజా వార్తలు