‘ఓజి’ ఊచకోత.. అప్పుడే 50 కోట్ల వసూళ్లు!?

OG-Thaman

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఒక్క సరైన సినిమా పడితే దాని తాలూకా యుఫోరియా ఎలా ఉంటుందో ఇపుడు చూస్తున్న చిత్రమే “ఓజి”. భారీ హైప్ ని సెట్ చేసుకున్న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుండగా ఈ సినిమా కోసం చూస్తున్న ఫ్యాన్స్ కి లేటెస్ట్ ట్రైలర్ మంచి ఫీస్ట్ ఇచ్చింది. ఇక దీనికి ముందే వరల్డ్ వైడ్ గా ఓజి చిత్రం రికార్డు బుకింగ్స్ కూడా మొదలు పెట్టుకోగా లేటెస్ట్ గా ఈ బుకింగ్స్ తోనే ఆల్రెడీ ఓజి 50 కోట్ల మార్క్ దగ్గరకి వచ్చేసినట్టు ట్రేడ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తుంది.

యూఎస్ సహా ఇతర దేశాలు ఇంకా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్, ఇతర బుకింగ్స్ కలిపి ఈ మార్క్ వచ్చేశాయట. ఇక ఫుల్ ఫ్లెడ్జ్ గా అయితే ఓజి రికార్డు బ్రేకింగ్ ఓపెనింగ్స్ సొంతం చేసుకుంటుంది అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా సుజీత్ దర్శకత్వం వహించాడు. అలాగే డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version