రూమర్స్ నమ్మకండి.. OG వచ్చేది ఆ రోజునే!

రూమర్స్ నమ్మకండి.. OG వచ్చేది ఆ రోజునే!

Published on Jul 2, 2025 10:00 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాల్లో ఓజి కూడా ఒకటి. ఈ సినిమాను దర్శకుడు సుజిత్ డైరెక్ట్ చేస్తుండగా పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్‌తో ఈ మూవీపై అంచనాలు నెక్స్ట్ లెవెల్‌లో నెలకొన్నాయి.

అయితే, ఈ సినిమా రిలీజ్ విషయంలో గతంలో పలు అనుమానాలు రేకెత్తాయి. దీంతో ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. సెప్టెంబర్ 25న ఓజి చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుందని చిత్ర యూనిట్ అనౌన్స్ చేశారు. అయితే, ఈ చిత్రం మళ్లీ వాయిదా పడుతుందనే టాక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో మేకర్స్ మరోసారి ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.

‘రూమర్స్ నమ్మకండి.. ఓజి చెప్పిన తేదీనే వస్తాడు..’ అంటూ మేకర్స్ తాజాగా మరోసారి కన్ఫర్మ్ చేశారు. దీంతో ఇక సెప్టెంబర్ 25న ఓజి రాక పక్కా అని అభిమానులు ఫిక్స్ అవుతున్నారు. ఈ సినిమాలో అందాల భామ ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డివివి దానయ్య ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు