వరల్డ్ రెండో బిగ్గెస్ట్ ఐమ్యాక్స్ స్క్రీన్ లో ‘ఓజి’ ఊచకోత.. నిమిషాల్లో హౌస్ ఫుల్!

OG

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అవైటెడ్ యాక్షన్ చిత్రం “ఓజి” పట్ల ఉన్న హైప్ ఇపుడు అంతా ఇంతా కాదు. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే కాకుండా సౌత్ లోనే భారీ ఓపెనింగ్స్ సాధించే పొటెన్షియల్ ఈ సినిమాకి ఇపుడు కనిపిస్తుంది. ఇక విదేశాల్లో సినిమా టికెట్స్ అయితే హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి.

ఆల్రెడీ యూఎస్ మార్కెట్ లో మిలియన్స్ కి పైగా డాలర్స్ గ్రాస్ అందుకోగా లేటెస్ట్ గా వరల్డ్ రెండో అతి పెద్ద ఐమ్యాక్స్ స్క్రీన్ లో బుకింగ్స్ ఓపెన్ అయితే నిమిషాల్లో ఓజి కి హౌస్ ఫుల్ పడిపోయింది. మరి ఆ స్క్రీన్ ఆస్ట్రేలియాకి చెందిన మెల్బోర్న్ ఐమ్యాక్స్ స్క్రీన్ అట. ఇక దెబ్బకి ఈ డిమాండ్ తో వారు ఓజి కి మరో అదనపు షో కూడా బుకింగ్స్ ఓపెన్ చేశారు. దీనితో ఓజి ఊచకోత ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

Exit mobile version