అఫీషియల్: హిందీలో ‘కింగ్డమ్’.. పవర్ఫుల్ టైటిల్ తో

సెన్సేషనల్ స్టార్ ది విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న అవైటెడ్ సినిమానే “కింగ్డమ్”. టాలెంటెడ్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ఈ సినిమా హిందీ రిలీజ్ కోసం ఈ మధ్య కొంచెం చర్చ నడిచింది. అయితే హిందీలోకి డెఫినెట్ గా రిలీజ్ ఉంటుంది అని నిర్మాత నాగవంశీ కన్ఫర్మ్ చేశారు. ఫైనల్ గా దీనిపై అఫీషియల్ అప్డేట్ వచ్చేసింది.

దీనితో మేకర్స్ కింగ్డమ్ ని హిందీలో ‘సామ్రాజ్య’ అనే పేరిట AA ఫిల్మ్స్ వారు విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు. సో కింగ్డమ్ చిత్రం తెలుగు, తమిళ్ లోనే కాకుండా హిందీలో కూడా విడుదల చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. మరి హిందీలో కింగ్డమ్ చిత్రం ఎలాంటి ఓపెనింగ్స్ అందుకుంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ అక్టోబర్ 31న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కి వస్తుంది.

Exit mobile version