అఫీషియల్: సుజీత్ సినిమాటిక్ యూనివర్స్.. ఇక పవన్, ప్రభాస్ ల జాతర

అఫీషియల్: సుజీత్ సినిమాటిక్ యూనివర్స్.. ఇక పవన్, ప్రభాస్ ల జాతర

Published on Sep 25, 2025 12:00 PM IST

OG-Saaho

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “ఓజి”. యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ యాక్షన్ గ్యాంగ్ స్టర్ డ్రామా భారీ హైప్ నడుమ వచ్చి సాలిడ్ టాక్ ని సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఎప్పుడు నుంచో ఓ క్రేజీ సర్ప్రైజ్ ఉన్నట్టుగా గట్టి టాక్ ఉన్న సంగతి తెలిసిందే.

సుజీత్ తన సినిమాటిక్ యూనివర్స్ ని ఈ సినిమాతో మొదలు పెడుతున్నాడు అని సాహో సినిమాకి లింక్ ఉందని మొదటి నుంచీ క్రేజీ బజ్ వచ్చింది. ఇలా అనుకున్నట్టుగానే నిన్న ప్రీమియర్స్ తోనే తాను ‘ఎస్ సి యూ’ అంటూ తన సినిమాటిక్ యూనివర్స్ పై హింట్ ఇచ్చాడు. ఇలా ఇక సినిమాలో కూడా మ్యాడ్ కనెక్షన్ తో ఓజి, సాహో సినిమాలకి లింక్ పెట్టడం జరిగింది.

ఇది మాత్రం థియేటర్స్ లో పవన్ ఇంకా రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి ఒక మ్యాడ్ లెవెల్ ఎక్స్ పీరియన్స్ ని అందించింది అని చెప్పాలి. దీనితో ఓజి పార్ట్ 2 పై మరింత బజ్ నెలకొంది. ఇక నెక్స్ట్ సినిమాలు తాను ఎలా ప్లాన్ చేస్తాడు అనేది టఫ్ క్వశ్చన్ గా ఇపుడు మారింది. వీటిని సరిగా హ్యాండిల్ చేస్తే మాత్రం మరో సాలిడ్ సినిమాటిక్ యూనివర్స్ పడడం ఖాయం అని చెప్పవచ్చు.

తాజా వార్తలు