అఫీషియల్: చిరు, అనీల్ ప్రాజెక్ట్ లో హీరోయిన్ ఎవరో కాదు!

మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేస్తున్న చిత్రాల్లో బ్లాక్ బస్టర్ హిట్స్ దర్శకుడు అనీల్ రావిపూడితో చేస్తున్న సాలిడ్ ఎంటర్టైనర్ కూడా ఒకటి. మరి పక్కా ప్లానింగ్ లో దూసుకెళ్తున్న ఈ చిత్రం హీరోయిన్ ఎవరు అనేది గత కొన్నాళ్ల చర్చగా మారగా ఇపుడు ఫైనల్ గా ఈ సస్పెన్స్ ని మేకర్స్ తెర దించేశారు.

మరి మళ్ళీ అనీల్ రావిపూడి మార్క్ ప్రమోషనల్ వీడియోతో ఈ సినిమాలో హీరోయిన్ గా స్టార్ హీరోయిన్ నయనతార నటిస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసేసారు. ఆమెపై కంప్లీట్ తెలుగులో సూపర్ ఫన్ వీడియో రిలీజ్ చేసి తమ అవైటెడ్ ప్రాజెక్ట్ లోకి ఆహ్వానం పలికారు. మొత్తానికి అయితే హీరోయిన్ కూడా ఈ సినిమాకి లాక్ అయ్యిపోయింది అని చెప్పొచ్చు. మరి ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందిస్తుండగా వచ్చే ఏడాది సంక్రాంతికి రఫ్ఫాడిద్దాం అని అంటున్నారు. అలాగే ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Exit mobile version