అఫీషియల్: ‘వార్ 2’ తెలుగు స్టేట్స్ హక్కులు సొంతం చేసుకున్న డైనమిక్ ప్రొడ్యూసర్

అఫీషియల్: ‘వార్ 2’ తెలుగు స్టేట్స్ హక్కులు సొంతం చేసుకున్న డైనమిక్ ప్రొడ్యూసర్

Published on Jul 5, 2025 11:15 AM IST

బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ అలాగే మన టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ల కలయికలో దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “వార్ 2” కోసం అందరికీ తెలిసిందే. ఇండియన్ సినిమా దగ్గరే ఇదొక క్రేజీ బిగ్గెస్ట్ మల్టీస్టారర్. దీనితో నార్త్ నుంచి సౌత్ వరకు భారీ హైప్ ని సెట్ చేసుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కుల విషయంలో మంచి సస్పెన్స్ కొనసాగుతూ వచ్చింది.

ఎన్టీఆర్ కి వీరాభిమాని మన టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్ సూర్య దేవర నాగవంశీ తీసుకున్నట్టుగా వచ్చిన రూమర్స్ ఇపుడు నిజం అయ్యాయి. నాగ వంశీ ఆ బిగ్ అప్డేట్ ని రివీల్ చేస్తూ క్రేజీ వీడియోతో హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధం అవుతున్నాం అని రివీల్ చేశారు. అరవింద సమేత, దేవర తర్వాత ఇప్పుడు తన తారక్ అన్న కోసం మరోసారి వార్ 2 తో తెలుగు స్టేట్స్ లో సంబరాలు జరుపుకుందాం అంటూ నాగవంశీ తన ప్రేమను వ్యక్తం చేశారు. సో మొత్తానికి ఆగస్ట్ 14న భారీ రిలీజ్ ఈ చిత్రానికి ఉండనుంది అని చెప్పవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు