అఫీషియల్: రామ్ కోసం అనిరుద్!

అఫీషియల్: రామ్ కోసం అనిరుద్!

Published on Jul 15, 2025 12:57 PM IST

మన టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా దర్శకుడు మహేష్ బాబు పి తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “ఆంధ్రా కింగ్ తాలూకా”. అనౌన్సమెంట్ తోనే మంచి బజ్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా నుంచి మేకర్స్ రీసెంట్ గానే ఫస్ట్ సింగిల్ ని కూడా అనౌన్స్ చేశారు.

హీరో రామ్ నే రాసిన ఈ సాంగ్ ఈ జూలై 18న విడుదల చేస్తున్నట్టుగా అనౌన్స్ చేయగా ఈ సాంగ్ కోసం మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ ని తీసుకున్నట్టుగా టాక్ కూడా వచ్చింది. మరి దీనిని మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించేసారు.

ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ ని అనిరుద్ గాత్రంతోనే వస్తున్నట్టు సాలిడ్ అప్డేట్ అందించడంతో ఈ ఫస్ట్ సింగిల్ అందులోని లవ్ సాంగ్ ని అనిరుద్ వాయిస్ లో వినేందుకు అంతా ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక ఈ సినిమాకి వివేక్ – మెర్విన్ లు సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు