రొమాంటిక్ మెలోడీగా రామ్, భాగశ్యీల ‘నువ్వుంటే చాలే’ సాంగ్..!

Andhra-King-Taluka

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు పి.మహేష్ బాబు డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక ఈ సినిమా నుంచి తాజాగా ఫస్ట్ సింగిల్ సాంగ్‌గా ‘నువ్వుంటే చాలే’ అనే పాటను రిలీజ్ చేశారు.

ఈ పాటను మ్యూజిక్ ద్వయం వివేక్-మెర్విన్ కంపోజ్ చేయగా సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ పాడారు. ఇక మరో విశేషమేమిటంటే.. ఈ పాటకు లిరిక్స్ అందించింది స్వయంగా హీరో రామ్. చక్కటి లిరిక్స్, మెలోడీ ట్యూన్స్‌తో ఈ పాట రొమాంటిక్ సాంగ్‌గా వినసొంపుగా ఉంది. ఇక యూత్‌కు ఈ పాట వెంటనే ఎక్కేయడం ఖాయం.

ఈ పాటతో ఆంధ్ర కింగ్ తాలూకా చిత్రంపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ సినిమాలో ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రంతో రామ్ బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ హిట్ అందుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. ఇక ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version