నువ్వా నేనా నాన్ స్టాప్ ఎంటర్టైనర్ అవుతుంది: శర్వానంద్

నువ్వా నేనా నాన్ స్టాప్ ఎంటర్టైనర్ అవుతుంది: శర్వానంద్

Published on Mar 11, 2012 10:43 PM IST


అల్లరి నరేష్ శర్వానంద్ నటించిన ‘నువ్వా నేనా’ చిత్రం పెద్ద ఎత్తున విడుదలకు సిద్ధమవుతుంది. శర్వానంద్ ఈ చిత్రం గురించి మాట్లాడుతూ నువ్వా నేనా నాన్ స్టాప్ ఎంటర్ టైనర్ అవుతుంది. బ్రహ్మానందం మరియు కోవై సరళ కామెడీ అందరినీ తప్పక నవ్విస్తుంది. వంశీ లాంటి నిర్మాతలు మన తెలుగు ఇండస్ట్రీకి మారి కొంత మంది కావాలి. ఇలాంటి మంచి సినిమాలను ఆదరిస్తే నిర్మాతలు తప్పకుండా ధైర్యం చేస్తారు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ఆడియోకి మంచి స్పందన వస్తున్నందుకు ఆనందంగా ఉంది. నారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వంశి కృష్ణ శ్రీనివాస్ నిర్మించారు. భీమ్స్ సంగీతం అందించిన ఈ చిత్రం మార్చి 16న విడుదలకు సిద్ధమవుతుంది.

తాజా వార్తలు