ఎన్టీవీ వార్షికోత్సవంలో పవన్, లోకేష్ శుభాకాంక్షలు !

ఎన్టీవీ వార్షికోత్సవంలో పవన్, లోకేష్ శుభాకాంక్షలు !

Published on Aug 31, 2020 9:00 AM IST

ఒకప్పుడు మీడియా అంటే.. కేవలం కొన్ని రకాల వార్తలను మాత్రమే ప్రసారం చేసేది. ప్రజలకు అలాంటి మీడియా ప్రసారం చేసిన వార్తలు మాత్రమే చూసేందుకు అవకాశం ఉండేది. అలాగే జర్నలిజం అంటే.. అప్పటివరకు కొంతమందికి మాత్రమే తెలుసు. కానీ, 13 ఏళ్ల క్రితం మీడియా రంగంలోకి ఎన్టీవీ అడుగుపెట్టి పెను మార్పులను తీసుకొచ్చింది. ప్రజలకు అన్ని రకాల వార్తలను అందించింది. తెలుగు మీడియా రంగంలో ఎన్నో సంచలనాలు సృష్టించిన ఎన్టీవీ న్యూస్ ఛానల్ 13వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. 13 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో విజయాలను సాధించిన ఎన్టీవీ ఏ ఒక్కరికి అనుకూలంగా ఉండకుండా నిజమైన వార్తలను నిక్కచ్చిగా ప్రసారం చేస్తూ, ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా నిలిచింది ఎన్టీవీ.

ఇటు ప్రజలకు అవసరమైన వార్తలను అందిస్తూనే మరోవైపు ధార్మిక కార్యక్రమాలను సైతం చేపడుతున్నది. 2013 నుంచి కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నది. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్తలు, మఠాధిపతులు, జాతీయ స్థాయి నాయకులు కోటి దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. జాతీయ సమైక్యతను ప్రతిబింబించే విధంగా జనగణమన కార్యక్రమాన్ని తీసుకొచ్చిన ఘనత ఎన్టీవీ సొంతం. 13 వార్షికోత్సవం సందర్భంగా నారా లోకేష్, జనసేన అధినేత, సినీనటుడు పవన్ కళ్యాణ్ , వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి, సినీనటుడు, నిర్మాత బండ్ల గణేష్ తదితరులు శుభాకాంక్షలు చెప్తూ ట్వీట్ చేయడం విశేషం.

తాజా వార్తలు