ఎన్టీఆర్ కెరీర్ లో నటన పరంగా బెస్ట్ అనిపించుకున్న చిత్రాలలో టెంపర్ ఒకటి. ఆ చిత్రంలో కరప్టెడ్ పోలీస్ అధికారి పాత్రలో ఎన్టీఆర్ విజృభించారు. టెంపర్ లో ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్ అండ్ డైలాగ్ డెలివరీ అంతా కంప్లీట్ డిఫరెంట్ గా ఉంటుంది. అప్పటి వరకు ఎన్టీఆర్ నటనలో మొనాటమి ఎక్కువైంది అని వస్తున్న విమర్శలకు టెంపర్ మూవీ గట్టి సమాధానం ఇచ్చింది. దర్శకుడు పూరి జగన్నాధ్ ఓ వైవిధ్యమైన కాన్సెప్ట్ తో డిఫరెంట్ గా టెంపర్ తెరకెక్కించాడు.
అలాగే టెంపర్ ఎన్టీఆర్ పరాజయాల పరంపరకు అడ్డుకట్ట వేసి ఆయనకు మంచి విజయం అందించింది. కాగా ఈ చిత్రం విడుదలై 5 సంవత్సరాలు పూర్తయిన సంధర్భంగా ప్రసాద్ ఐమాక్స్ లో ఈనెల 13న ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. 13 వ తేదీ సాయంత్రం 8గంటలకు టెంపర్ స్పెషల్ షో వేయనున్నారు. ఈ షోకి ఎన్టీఆర్ తో పాటు, టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యే అవకాశం కలదు. ఇక టెంపర్ చిత్రాన్ని బండ్ల గణేష్ నిర్మించగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.