పార్లమెంట్ లో ఆవిష్కరించిన ఎన్.టి.ఆర్ విగ్రహం

పార్లమెంట్ లో ఆవిష్కరించిన ఎన్.టి.ఆర్ విగ్రహం

Published on May 7, 2013 6:50 PM IST

NTR
లెజండ్రీ తెలుగు సినిమా యాక్టర్, తెలుగు వారి ఘనతని దశదిశలా చాటి చెప్పిన ముఖ్య మంత్రి నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని ఈ రోజు పార్లమెంట్ లో ఆవిష్కరించారు. ఈ విగ్రహాన్ని ఎన్.టి.ఆర్ గారి కుమార్తె పురంధరేశ్వరి అందించారు. 9.3 అడుగుల భారీ ఎన్.టి.ఆర్ విగ్రహాన్నిలోక్ సభ స్పీకర్ మీరా కుమార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి నందమూరి కుటుంభ సభ్యులైన నందమూరి బాలకృష్ణ, హరికృష్ణ, పురంధరేశ్వరి, ఎన్.టి.ఆర్, కళ్యాణ్ రామ్ తదితరులు హాజరయ్యారు. అలాగే ప్రధాని మన్మోహన్ సింగ్, అద్వాని, సుష్మ స్వరాజ్, రవిశంకర్ ప్రసాద్, చంద్రబాబు నాయుడు, చిరంజీవి, లక్ష్మీ పార్వతి, షిండే, ఆజాద్, ములాయం, అరుణ్ జెట్లీ తదితరులు హాజరయ్యారు.

ఈ కార్యక్రమానికి హాజరైన చాలా మంది నాయకులు ఎన్.టి.ఆర్ గారి రోజులను గుర్తుకు తెచ్చుకున్నారు అలాగే తెలుగు వారికి ఆయన చేసిన మేలుని గురించి ప్రశంశించారు.

తాజా వార్తలు