ఎన్టీఆర్ కొడుకుపై ఇప్పట్లో చర్చ ఆగేట్లు లేదే..!

ఎన్టీఆర్ కొడుకుపై ఇప్పట్లో చర్చ ఆగేట్లు లేదే..!

Published on Mar 15, 2020 3:00 AM IST

జూనియర్ ఎన్టీఆర్ చిన్న కొడుకు భార్గవ రామ్ పై సోషల్ మీడియాలో చర్చకు ఇప్పట్లో తెరపడేట్టు లేదు. భార్గవ్ రామ్ ని ఫ్యూచర్ యంగ్ టైగర్ అంటూ ఎత్తేస్తున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానులలో ఈ విషయంపై విపరీతమైన చర్చ నడుస్తుంది. సీనియర్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ తో భార్గవ్ రామ్ ని పోల్చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఓ స్టార్ కిడ్ పై ఇంత చర్చ నడవలేదు. కొంతమంది భార్గవ్ ని పార్లిజీ బేబీ తో పోల్చుతున్నారు. హోళీ సందర్భంగా ఎన్టీఆర్ ఫ్యామిలీ ఫోటో పంచుకోగా అది పెద్ద చర్చకు దారితీసింది.

ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ యూనిట్ తదుపరి నార్త్ ఇండియా షెడ్యూల్ కి సిద్దమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ కొమరం భీం రోల్ చేస్తుండగా, చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్ర చేస్తున్నారు.

తాజా వార్తలు