ఎన్.టి.ఆర్ కొత్త సినిమా టైటిల్ ‘రామయ్యా వస్తావయ్యా’

First Posted at 16:10 on Apr 20st

Ramayya-Vasthavayya

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ – హరీష్ శంకర్ కాంబినేషన్లో రానున్న సినిమాకి ‘రామయ్యా వస్తావయ్యా’ అనే టైటిల్ ని ఖరారు చేసారు. ఇప్పుడే విడుదల చేసిన ఫస్ట్ లుక్ లో ఎన్.టి.ఆర్ గద పట్టుకొని ఉన్నాడు. గత కొన్ని వారాలుగా ఈ సినిమా టైటిల్ విషయంలో పలు పేర్లు వినిపిస్తున్నాయి. హారీష్ శంకర్ వాటన్నిటికీ తెరదించి ‘రామయ్యా వస్తావయ్యా’ అనే టైటిల్ ని ఎంచుకున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది.
ఈ సినిమా గురించి దిల్ రాజు మాట్లాడుతూ ‘ ‘బృందావనం’ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఎన్.టి.ఆర్ తో కలిసి పనిచేస్తున్నాం. ఈ సినిమా పై ఆకాశాన్ని తాకే రేంజ్ లో అంచనాలున్నాయని మాకు తెలుసు సినిమా తెరకెక్కుతున్న విధానం చూస్తుంటే వాటిని మేము కచ్చితం గా రీచ్ అవుతాం. ఇటీవలే ఎన్.టి.ఆర్ – సమంత లపై ఓ పాటని చిత్రీకరించాం చాలా బాగా వచ్చింది. హరీష్ శంకర్ వరుసగా రెండు హిట్స్ అందుకున్నాడు అందులోనూ ‘గబ్బర్ సింగ్’ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ‘రామయ్యా వస్తావయ్యా’ తో కూడా అందరినీ ఆకట్టుకుంటాడు అనడంలో ఎలాంటి అనుమానము లేదని’ అన్నాడు. సమంత, శ్రుతి హాసన్ హీరోయిన్స్ గా కనిపించనున్న ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమా ఆగష్టు 9 న ప్రేక్షకుల ముందుకు వస్తుందని అంచనా వేస్తున్నారు.

Exit mobile version