యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘దమ్ము’ సినిమాలో పలు విభిన్నమైన గెటప్స్ తో కనిపించబోతున్నాడు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలోని ఒక పాటలో ఎన్టీఆర్ పోలిస్ ఆఫీసర్ మరియు పలు విభిన్నమైన పౌరాణిక గెటప్స్ తో కనిపించబోతున్నట్లు చెబుతున్నారు. ఈ పాటలో వచ్చే విఎఫ్ఎక్స్ సినిమాకి హైలెట్ అవుతాయనీ, చిత్ర నిర్మాత ఈ పాట కోసం చాలా సమయం మరియు డబ్బు ఖర్చు పెట్టి తీసారని చెబుతున్నారు. సినిమాలో ఇది రెండవ పాటగా వస్తుందని చెబుతున్నారు. దర్శకుడు బోయపాటి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరక్కిస్తున్నాడు. నిర్మాత వల్లభ కూడా ఖర్చుకి ఏ మాత్రం వెనకాడకుండా ఈ సినిమాని తీర్చిదిద్దుతున్నారు. ఎన్టీఆర్ కి జోడీగా త్రిషా, కార్తీక నటిస్తుండగా ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్న దమ్ము ఆడియో మార్చ్ 29 న విడుదల చేయబోతున్నారు.