ఫ్యాన్స్ ను ఉద్దేశించి ఎన్టీఆర్ ఎమోషనల్ కామెంట్స్

‘ఎన్టీఆర్ – హృతిక్ రోష‌న్‌’ కలయికలో రాబోతున్న మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీస్టారర్ ‘వార్ 2’. ఈ సినిమా ఆగస్టు 14, 2025న థియేటర్స్ లోకి రాబోతుంది. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో విడుదలకు ముందస్తు వేడుక జరిగింది. ఈ వేడుకలో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ‘నా పాతికేళ్ల ప్రయాణంలో మీ నుంచి ఎంతో ప్రేమని పొందాను. ఈ జన్మకు ఇది చాలు, ఇంకేమీ వద్దు. నందమూరి హరికృష్ణ ఓ తనయుడిగా నాకు జన్మనిచ్చారు. నా ఈ జీవితం మాత్రం అభిమానులకే అంకితం. జీవితాంతం నన్ను ప్రేమిస్తున్న అందరినీ ఆనందంగా ఉంచడానికే నా అడుగులు పడతాయి తప్ప బాధ పెట్టడానికి కాదు. దేవుడు చల్లగా చూస్తే ఇంకొన్నేళ్లు అందరం కలిసే ముందుకు వెళదాం’ అంటూ తన ఫ్యాన్స్ ను ఉద్దేశించి ఎన్టీఆర్ తెలిపారు.

ఎన్టీఆర్ ఇంకా మాట్లాడుతూ.. ‘నేను బాగుండాలని మీరు చేసిన ప్రార్థనలకు ఎన్ని జన్మలెత్తినా రుణం తీర్చుకోలేను. నా ప్రయాణం మొదలై 25 వసంతాలు కావడంతో అభిమానులందరినీ కలుసుకోవాలని ఉండేది. నన్ను ఒత్తిడి చేసి ఈ వేడుకని ఏర్పాటు చేసిన నిర్మాత నాగవంశీకి కృతజ్ఞతలు. ‘వార్‌ 2’ అనే చిత్రం నేను చేయడానికి కారణం నిర్మాత ఆదిత్య చోప్రా. ఈ చిత్రం కచ్చితంగా చేయాలని, నీ అభిమానులు గర్వపడేలా ఈ చిత్రాన్ని తీశాడు. ‘కహోనా ప్యార్‌ హై’ చిత్రంలో హృతిక్‌ డ్యాన్స్‌ చూసి ముచ్చటపడ్డా. ఆయన డ్యాన్స్‌ చూసి స్ఫూర్తి పొందిన నేను, 25 ఏళ్ల తర్వాత ఆయన పక్కన నటించడం, ఆయనతో కలిసి డ్యాన్స్‌ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా’ అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.

Exit mobile version