డాన్సులతో ఫ్యాన్స్ ని థ్రిల్ చేయనున్న ఎన్.టి.ఆర్

RV

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నటించిన ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ అంచనాల మధ్య రిలీజ్ కానున్న ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ తన కెరీర్ లోనే ఎన్నడు కనిపించనంత స్టైలిష్ లుక్ తో ఆకట్టుకోనున్నాడు. డైరెక్టర్ హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలోని కొన్ని పాటలని మీడియా వారికి చూపించారు, పాటల విజువల్స్ చాలా బాగున్నాయి.

ఎన్.టి.ఆర్ తన డాన్సులతో అభిమానుల్ని థ్రిల్ చేయనున్నారు. ‘పండగ చేస్కో’ సొంగ లో డాన్స్ సూపర్బ్, ‘జాబిలమ్మ’ పాటలో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. అలాగే ‘నేనెప్పుడైనా’ పాటని ఎన్నడూ చూడని లోకేషన్స్ లో షూట్ చేసారు. ఈ సాంగ్స్ విజువల్స్ గురించి తెలిసిన తర్వాత ఎన్.టి.ఆర్ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. దిల్ రాజు నిర్మించిన ఈ మూవీకి థమన్ మ్యూజిక్ కంపోజ్ చేసాడు. సమంత హీరోయిన్ గా కనిపించనున్న ఈ మూవీలో శృతి ఓ కీలక పాత్రలో కనిపించనుంది.

Exit mobile version