యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా చేస్తున్న ‘బాద్ షా’ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ రోజు ఓ పాట, కొన్ని సన్నివేశాలను ఓల్డ్ సిటీలో చిత్రీకరించనున్నారు. ఎన్.టి.ఆర్ స్టైలిష్ అవతారంలో కనపడుతున్న ఈ సినిమా హై కామెడీ ఎంటర్ టైనర్ గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. శ్రీను వైట్ల డైరెక్ట్ చేస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాని పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు.
ఇప్పటికే ఇటలీ, బ్యాంకాక్లలో కొన్ని షెడ్యూల్స్ జరుపుకున్న ఈ సినిమాలోని కొంత భాగాన్ని ప్రస్తుతం హైదరాబాద్లో షూట్ చేస్తున్నారు. ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ కథారచయితలు గోపి మోహన్ – కోన వెంకట్ ఈ సినిమాకి కథని అందించారు.