త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ సినిమా ఇప్పట్లో లేనట్లే !

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ‘అరవింద సమేత, ‘అలవైకుంఠపురములో’ వంటి హిట్ చిత్రాల తరువాత, మళ్లీ తన తర్వాతి చిత్రాన్ని కూడా మళ్లీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ‘అయినను పోయి రావలె హస్తినకు’ సినిమా చేయాలకున్న సంగతి తెలిసిందే. కానీ అది ఇప్పుడు సాధ్యమయ్యేలా కనబడటం లేదు. ఎన్టీఆర్ తన తరువాత సినిమాని ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడని… ప్రశాంత్ సినిమా తరువాతే త్రివిక్రమ్ తో సినిమా చేస్తాడాని తెలుస్తోంది.

అందుకే త్రివిక్రమ్ మహేష్ బాబుతో ప్లాన్ చేస్తున్నాడట. ఈ లోపు మీరు ప్రశాంత్ నీల్ సినిమా పూర్తి చేయండి, ఆ తరువాత మనం కలిసి చేద్దాం అని త్రివిక్రమ్ తారక్ కి ఇప్పటికే స్పష్టం చేశాడట. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు గాని, ఫిల్మ్ సర్కిల్స్ లో కూడా ఇవే వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా వీరి కలయికలో మరో సినిమా వస్తే ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు.

ఎందుకంటే ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేశారు, పైగా ఈ సినిమా కోసం త్రివిక్రమ్ నేటి భిన్నమైన రాజకీయ నేపథ్యం తీసుకున్నారు. తారక్ ను రాజకీయ నాయకుడిగా చూడాలని ఫ్యాన్స్ ఎప్పటినుండో ఆశ పడుతున్నారు.

Exit mobile version