నలుగురు భామలతో కలిసి చిందేస్తున్న ఎన్టీఆర్

నలుగురు భామలతో కలిసి చిందేస్తున్న ఎన్టీఆర్

Published on Mar 27, 2012 12:30 PM IST


యంగ్ టైగర్ ఎన్టీఆర్ నలుగురు ముద్దుగుమ్మలతో కలిసి ఆడిపాడబోతున్నాడు. దమ్ము సినిమాలోని ఒక పాటలో ఎన్టీఆర్ నలుగురు అందాల భామలతో కలిసి డాన్సు చేయబోతున్నాడు. ప్రస్తుతం హైదరాబాదులో చిత్రీకరిస్తున్న ఈ పాటలో ఈ సినిమా హీరొయిన్లు త్రిషా, కార్తీకలతో పాటుగా తషు కౌశిక్ మరియు రచనా మౌర్య కూడా పాల్గొంటున్నారు. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి వేసిన భారీ సెట్లో ఈ పాట చిత్రీకరిస్తున్నారు. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియో అభిమానుల సమక్షంలో ఈ నెల 29న భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. గతంలో సింహా వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన బోయపాటి డైరెక్షన్లో వస్తున్న దమ్ము చిత్రం పై భారీ స్థాయిలో అంచనాలున్నాయి.

తాజా వార్తలు