ఎన్.టి.ఆర్, సునీల్ బాహుబలిలో నటించడం లేదు – రాజమౌళి

ఎన్.టి.ఆర్, సునీల్ బాహుబలిలో నటించడం లేదు – రాజమౌళి

Published on Jan 30, 2014 11:45 AM IST

ss-rajamouli
టాలీవుడ్ సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘బాహుబలి’. గత కొద్ది రోజులుగా ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ మరియు కామెడీ హీరో సునీల్ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారని సోషల్ నెట్వర్కింగ్ లో పలు పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై స్పందించిన రాజమౌళి వాళ్ళెవరూ తన సినిమాలో నటించడం లేదని పుకార్లకు తెరదించాడు.

‘తారక్ బాహుబలి సినిమాలో నటించడం లేదు. ఆ వార్తలో నిజం లేదు. అలాగే సునీల్ కూడా నటించడం లేదు. ఇది కాకుండా నేను పవన్ కళ్యాణ్ కి కథ చెప్పాను అని వస్తున్న వార్తల్లో కూడా నిజం లేదని’ రాజమౌళి ట్వీట్ చేసాడు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, యంగ్ హంక్ రానా అన్నదమ్ములుగా నటిస్తున్న ఈ సినిమాలో అనుష్క, తమన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రెండు పార్ట్స్ గా రానున్న ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.

తాజా వార్తలు