ఎన్.టి.ఆర్ – సుకుమార్ సినిమా ఆగిపోయిందా?

NTR-and-Sukumar
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ప్రస్తుతం ‘రభస’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే ఆయన సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఈ సినిమాకి బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. ఈ విషయాన్ని వారు అధికారికంగా కూడా అనౌన్స్ చేసారు.

తాజాగా ఇండస్ట్రీలో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఆగిపోయిందని అంటున్నారు. ఈ చిత్ర నిర్మాత అయిన బివిఎస్ఎన్ ప్రసాద్ పక్కకి తప్పుకున్నారని అందుకే ప్రస్తుతానికి ఈ సినిమా ఆగిపోయిందని అంటున్నారు. కానీ ఈ విషయంపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మీరు మా సైట్ ని విజిట్ చేస్తూ ఉండండి, త్వరలోనే ఈ సినిమాకి సంబందించిన కచ్చితమైన సమాచారాన్ని అందిస్తాం.

Exit mobile version