రామోజీ ఫిల్మ్ సిటీలో ఎన్ టి.ఆర్, సమంత సినిమా షూటింగ్

Ramayya-Vasthavayya
‘కందిరీగ’ శ్రీనివాస్ దర్శకత్వం వస్తున్న సినిమాలో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా సమంత హీరోయిన్ గా నటిస్తున్నారు. వీరిద్దరూ ఇప్పటికే హరీష్ శంకర్ సినిమా ‘రామయ్యా వస్తావయ్యా’ లో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలో పూర్తి కానుంది. ‘కందిరీగ’ శ్రీనివాస్ సినిమాకి ‘రభసా’ అనే పేరు వినిపిస్తోంది. కానీ నిర్వాహకులు కొత్త పేరు కోసం చూస్తున్నారు. ఈ విషయాన్ని సమంత తన ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. ‘రభసా’ సినిమా సెకండ్ షెడ్యూల్ ఈ రోజు (సెప్టెంబర్ 10) నుండి రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభంకానుందని తెలిపింది. ఈ సినిమా మంచి కామెడీ తో మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోందని సమాచారం. ఈ సినిమాని బెలంకొండ సురేష్ నిర్మిస్తున్నాడు.

Exit mobile version