మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో తమ అభిమాన హీరోకు వారు శుభాకాంక్షలు తెలుపుతూ రచ్చ చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా ఆయన నటిస్తున్న బాలీవుడ్ చిత్రం ‘వార్-2’ నుంచి టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
బాలీవుడ్ యాక్షన్ స్పై చిత్రం ‘వార్’కు సీక్వెల్‌గా ‘వార్-2’ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు దర్శకుడు అయాన్ ముఖర్జీ. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌తో పాటు ఎన్టీఆర్ ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఈ చిత్ర టీజర్ ఆద్యంతం పవర్‌ప్యాక్డ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఆకట్టుకుంటుంది. ఇక తనకు బర్త్ డే విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ చెబుతూ తారక్ ఓ పోస్ట్ చేశాడు.
తనపై ఇంతలా అభిమానం చూపెడుతున్న ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటానని ఆయన అన్నారు. వార్-2 చిత్ర టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ రావడం సంతోషంగా అనిపించిందని.. అభిమానులు ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తారా అని తాను ఆసక్తిగా చూస్తున్నానని తారక్ పేర్కొన్నాడు. ఆగస్టు 14న రిలీజ్ అవుతున్న ఈ సినిమాను అందరూ చూసి ఎంజాయ్ చేస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.