కందిరీగ 2లో ఎన్టీఆర్?

కందిరీగ 2లో ఎన్టీఆర్?

Published on Dec 5, 2012 1:30 AM IST


ఫిలిం నగర్లో తాజా సమాచారం ప్రకారం “కందిరీగ 2” చిత్రంలో రామ్ స్థానంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించనున్నారు. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నారు. గతంలో బెల్లంకొండ సురేష్,రామ్ మరియు సంతోష్ శ్రీనివాస్ “కందిరీగ” చిత్రంతో బాక్స్ ఆఫీస్ వద్ద విజయాన్ని నమోదు చేశారు. తిరిగి ఇదే మాయాజాలాన్ని చెయ్యాలని “కందిరీగ 2” మొదలు పెట్టారు కాని నిర్మత,దర్శకుడు మరియు హీరో కి మధ్య అభిప్రాయ విభేధాల కారణంగా ఈ చిత్రం చిత్రీకరణకి నోచుకోలేదు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో రామ్ స్థానంలో ఎన్టీఆర్ నటించనున్నట్టు తెలుస్తుంది. సంతోష్ శివన్ చెప్పిన కథ నచ్చడంతో అయన పచ్చ జెండా ఊపినట్టు సమాచారం. దీని గురించి ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. ఈ వార్త ఎంతవరకు నిజమో వేచి చూడాల్సిందే

తాజా వార్తలు