మే 9కి ఎన్.టి.ఆర్ ‘రభస’ వాయిదా పడిందా?

మే 9కి ఎన్.టి.ఆర్ ‘రభస’ వాయిదా పడిందా?

Published on Jan 28, 2014 7:00 PM IST

ntr-new-movie
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ప్రస్తుతం ‘కందిరీగ’ ఫేం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి ‘రభస’ అనేది వర్కింగ్ టైటిల్. ప్రస్తుతం ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ముందుగా ఈ సినిమాని మార్చి28న రిలీజ్ చేయాలనుకున్నారు కానీ పలు కారణాల వల్ల మేకి వాయిదా వేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఎన్.టి.ఆర్ సరసన సమంత, ప్రణిత హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ సినిమా విషయంలో ఎన్.టి.ఆర్ పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ ని బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నాడు.

తాజా వార్తలు