ఎన్.టి.ఆర్ నటిస్తున్న ‘రామయ్యా వస్తావయ్యా’ చిత్రం ఎటువంటి రాజకీయ సంబంధిత గొడవలూ జరగకపోతే ఈ నెల 10న విడుదలకు సిద్ధమవుతుంది.
ఈ సినిమాపై ఎన్.టి.ఆర్ చాలా నమ్మకంగావున్నాడు. సినిమాలో కధ తన పాత్ర చిత్రీకరణ తన నమ్మకానికి కారణమని సమాచారం. హీరోను తెరపై సూపర్ హీరోలా చూపించడం దర్శకుడు హరీష్ శంకర్ కు పెన్నుతో పెట్టిన విద్య. కేవలం అలంటి పాత్రనే ఎన్.టి.ఆర్ అభిమానులు అతనినుండి కోరుకుంటున్నారు.
సమంత హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ ఒక ముఖ్యపాత్ర పోషించింది. థమన్ సంగీత దర్శకుడు. దిల్ రాజు నిర్మాత.