ఫోటో మూమెంట్ : తమ పార్ట్‌నర్స్‌తో ఎన్టీఆర్-నీల్ సందడి

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం మాస్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్-నీల్ హ్యాష్‌ట్యాగ్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా పూర్తి మాస్ అంశాలతో రూపొందుతోంది. ఇక ప్రశాంత్ నీల్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కి్స్తుండటంతో ఈ మూవీపై అంచనాలు నెక్స్ట్ లెవెల్‌లో క్రియేట్ అయ్యాయి.

ఇటీవల ఈ చిత్ర షూటింగ్‌లో ఎన్టీఆర్ జాయిన్ అయ్యాడు. ప్రస్తుతం కొన్ని భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. ఇక ఈ సినిమాకు బ్రేక్ దొరికినప్పుడల్లా హీరో ఎన్టీఆర్‌తో పాటు దర్శకుడు ప్రశాంత్ నీల్ తమ ఫ్యామిలీకి సమయం కేటాయిస్తున్నారు. ఈ క్రమంలోనే వారు తమ భార్యలతో సరదగా సందడి చేస్తున్న ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

‘డ్రాగన్’ మేకర్స్ ఇలా తమ పర్సనల్ లైఫ్ ఫోటోలను అభిమానులతో షేర్ చేయడం సంతోషంగా ఉందని ఫ్యాన్స్ అంటున్నారు. అలాగే సినిమాకు సంబంధించి కూడా అప్డేట్స్ ఇస్తే బాగుంటుందని వారు ఈ సందర్భంగా కోరుతున్నారు.

Exit mobile version